తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రక్కు, నలుగురు మృతి - ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రక్కు

ఓ ట్రక్కు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. ఈ ప్రమాదం ఉత్తర్​ప్రదేశ్​ మెయిన్​పురిలో జరిగింది. హరియాణా గురుగ్రామ్​లో కారు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు.

road accident in mainpuri
road accident in mainpuri

By

Published : Aug 16, 2022, 10:26 AM IST

హరియాణా గురుగ్రామ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం దిల్లీ-జైపుర్​ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తరలించారు. మృతులంతా దిల్లీకి చెందిన వారిగా గుర్తించామని పోలీసుల తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిని పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. నిద్రిస్తున్న ఇద్దరు మృతి: ఉత్తర్​ప్రదేశ్​ మెయిన్​పురిలో ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. ఇంట్లో నిద్రపోతున్న రిటైర్డ్​ ఇన్​స్పెక్టర్​ దంపతులు సహా ట్రక్కులోని ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రక్కులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను క్రేన్ సహాయంతో వెలికితీశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి, 9వేల దిగువకు కేసులు

వాజ్​పేయీకి రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళులు

ABOUT THE AUTHOR

...view details