తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువతిపై అత్యాచారం- మాజీ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు - యోగేంద్ర సాగర్​

యువతిని అపహరించి అత్యాచారం చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. 2008 నాటి ఈ కేసులో అతడిని దోషిగా తేల్చింది. మరో ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చి ఇప్పటికే శిక్ష ఖరారు చేసింది.

former-mla-gets-life-imprisonment-for-kidnapping-and-rape-girl-student
యువతిపై అత్యాచారం కేసులో మాజీ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు

By

Published : Oct 30, 2021, 5:32 PM IST

రేప్​ కేసులో ఉత్తర్​ప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే యోగేంద్ర సాగర్​కు జీవిత ఖైదు విధించింది బదాయూలోని ఎంపీఎఎంల్​ఏ కోర్టు. ఈ కేసులో మరో ఇద్దరు దోషులు తేజేంద్ర సాగర్​, మీనూ శర్మలకు ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

2008లో అప్పటి బిల్సీ నియోజక వర్గ ఎమ్మెల్యే యోగేంద్ర సాగర్​ తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. 13 సంవత్సరాల తర్వాత అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది.

ప్రస్తుతం బిల్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా యోగేంద్ర సాగర్ కుమారుడు కుశాగ్ర సాగర్ ఉన్నారు. ఆయన భాజపా తరఫున పోటీ చేసి గెలుపొందారు.

ఇదీ చదవండి:'కాంగ్రెస్ ఇచ్చేది వాగ్దానాలు కాదు.. అభయం'

ABOUT THE AUTHOR

...view details