తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదేళ్ల ప్రాయంలోనే పీఠాధిపతి- ఎక్కడంటే? - ఐదేళ్లకే పీఠాధిపతి

బాహుబలి సినిమాలో అప్పుడే పుట్టిన మహేంద్ర బాహుబలిని మహారాజుగా ప్రకటించింది శివగామి. అదే కోవలో కర్ణాటకలో ఓ ఐదేళ్ల బాలుడు పీఠాధిపతిగా నియమితుడై.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఓ ఐదేళ్ల బాలుడు.. పీఠాధిపతి అవ్వటం చరిత్రలో ఇదే మొదటిసారని పండితులు చెబుతున్నారు.

monastery
ఐదేళ్ల ప్రాయంలోనే పీఠాధిపతి

By

Published : Jul 14, 2021, 5:32 PM IST

ఐదేళ్ల ప్రాయంలోనే పీఠాధిపతి

కర్ణాటకలోని కలబురిగిలో.. ఓ ఐదేళ్ల బాలుడు పీఠాధిపతిగా నియమితుడై.. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. హిరేమత్ సంస్థానానికి చెందిన పీఠాధిపతి శివబసవ శివచార్య.. సోమవారం గుండెపోటుతో మరణించారు. ఆ స్థానంలో.. అతడి సోదరుడు గురుంజనయ్య కుమారుడు నీలకంఠ(5)ను, కలుగా మఠానికి నూతన పీఠాధిపతిగా నియమించారు.

పీఠాధిపతి నీలకంఠ

చరిత్రలో మొదటిసారి..

వేద పండితుల సమక్షంలో మంగళవారం నియామక ప్రక్రియను ఘనంగా జరిపారు. పీఠాధిపతి స్థానం ఖాళీగా ఉంచలేమంటూ.. ఆ మేరకు నూతన నియామకం జరిపినట్లు పండితులు స్పష్టం చేశారు. ఓ ఐదేళ్ల బాలుడు.. పీఠాధిపతి అవ్వటం చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతున్నారు.

ఇదీ చదవండి :ఆయన ఆర్మీ మేజర్, ఆమె సిటీ మెజిస్ట్రేట్​.. రూ.500 ఖర్చుతో పెళ్లి

ABOUT THE AUTHOR

...view details