దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు వారాంతపు లాక్డౌన్లు, కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటున్నాయి. ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే..
జమ్ముకశ్మీర్- శ్రీనగర్‌లో..
ఏప్రిల్ 26 ఉదయం 6 గంటల వరకు జమ్ముకశ్మీర్‌లో వారాంతపు కర్ఫ్యూ అమలైంది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో నగరాలు, వీధులు నిర్మానుష్యంగా మారాయి.
శ్రీనగర్‌లో బోసిపోయిన వీధులు నిత్యవసరాలకు గుమిగూడి..
కర్ణాటక శివమొగ్గ ప్రాంతంలో నిత్యవసర వస్తువులు కొనేందుకు ప్రజలు గుమిగూడారు. వారాంతపు లాక్డౌన్ నేపథ్యంలో 6 గంటల నుంచి 10 గంటల వరకే దుకాణాలు తెరవనున్నట్లు ప్రభుత్వం ఆదేశాలివ్వడం వల్ల మార్కెట్లో విపరీతంగా జనం కనిపించారు.
కర్ణాటకలో వారాంతపు లాక్డౌన్ యూపీలో..
ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో వారాంతపు లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్నవారినే బయటతిరిగేందుకు అనుమతి ఇస్తున్నారు.
యూపీలో వాహనాన్ని పరిశీలిస్తున్న పోలీసులు బ్యూటీ పార్లర్లు మూసివేత..
తమిళనాడులో ఆదివారం విధించిన సంపూర్ణ లాక్డౌన్ నేపథ్యంలో రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. ఏప్రిల్ 26 నుంచి బ్యూటీ పార్లర్లు, సెలూన్లు ఇతర దుకాణాలు మూసివేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తమిళనాడులో వారాంతపు లాక్డౌన్ నిర్మానుష్యంగా కనిపిస్తున్న రహదారి ఆరు రోజుల లాక్డౌన్లో
దిల్లీలో వారం రోజుల లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు రహదారులపై వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్నవారికే బయటతిరిగేందుకు అవకాశమిస్తున్నారు.
దిల్లీలో వారం రోజుల లాక్డౌన్ ఇదీ చదవండి:'కరోనాపై పోరులో భారత్‌కు అండగా ఉంటాం'