తెలంగాణ

telangana

భాజపా నేత సువేందు అధికారికి ఈసీ నోటీసులు

By

Published : Apr 8, 2021, 10:33 PM IST

భాజపా నేత, నందిగ్రామ్​ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 29న నందిగ్రామ్​ ప్రచారంలో విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నోటీసులు పంపింది. 24గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Suvendu Adhikari
సువేందు అధికారి

మతపరమైన విషయాలకు సంబంధించి భాజపా నేత, నందిగ్రామ్​ అభ్యర్థి సువేందు అధికారి నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయనకు ఈసీ నోటీసులు జారీ చేసింది. 24గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

మార్చి29న నందిగ్రామ్​లో జరిగిన ప్రచారంలో విద్వేష పూరిత ప్రసంగం చేశారని సీపీఐ(ఎంఎల్​) కేంద్రం కమిటీ నేత కవితా కృష్ణన్​ ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఎన్నికల సంఘం సువేందుకు నోటీసులు పంపింది.

కాగా మతం ఆధారంగా ఓట్లను అభ్యర్థించారనే ఆరోపణలతో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈసీ నోటీసులు జారీ చేసింది. వివిధ పార్టీలకు ఓటు వేసి ముస్లింలు తమ ఓటు బ్యాంకును చీలనీయొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారని భాజపా ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది. 48 గంటల్లోగా సమాధానం తెలపాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:మమతా బెనర్జీకి ఈసీ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details