తెలంగాణ

telangana

గగనతలంలో వస్తువుల రవాణాకు సరికొత్త వ్యవస్థ

By

Published : Dec 19, 2021, 1:52 PM IST

Updated : Dec 19, 2021, 3:39 PM IST

DRDO testing Aerial Delivery System: గగనతలంలో భారీ వస్తువులను రవాణా చేసే వ్యవస్థను డీఆర్​డీఓ విజయవంతంగా ప్రదర్శించింది. ఏరియల్‌ డెలివరీ రీసెర్చ్ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఆర్​డీఈ) ఆగ్రా విభాగం ఈ గగనతల ప్రదర్శన నిర్వహించింది.

DRDO conducts flight demonstration
DRDO conducts flight demonstration

గగనతలంలో వస్తువుల రవాణాకు సరికొత్త వ్యవస్థ

DRDO testing Aerial Delivery System: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) గగనతలంలో భారీ వస్తువులను రవాణా చేసే వ్యవస్థను విజయవంతంగా ప్రదర్శించింది. ఏరియల్‌ డెలివరీ రీసెర్చ్ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఆర్​డీఈ) ఆగ్రా విభాగం ఈ గగనతల ప్రదర్శన నిర్వహించింది. 500 కేజీల సామర్థ్యం కలిగిన కంట్రోల్డ్‌ ఏరియల్​ డెలివరీ సిస్టమ్‌ను ప్రదర్శించింది.

గగనతలంలో భారీ వస్తువులను మోసుకెళ్తున్న పారాషూట్​

రామ్‌ ఎయిర్‌ పారాషూట్‌ ద్వారా 500 కిలోల బరువైన వస్తువును నిర్దేశిత ప్రాంతంలో దించారు. జీపీఎస్​తో అనుసంధానం చేయడం సహా సెన్సార్లు అమర్చడం వల్ల అత్యంత కచ్చితత్వంతో నిర్దేశిత ప్రదేశంలో ఆ వస్తువును పారాషూట్‌ దించింది. ఇందుకోసం ఏఎన్​32 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఉపయోగించారు.

నిర్దేశిత ప్రాంతంలో దిగిన పారాషూట్​

ఐదు వేల మీటర్ల ఎత్తు నుంచి గాలిలోకి ఎగిరిన పారాషూట్‌ నిర్దేశిత ప్రదేశంలో దిగింది. భారత సైన్యం, వాయుసేనకు చెందిన 11 మంది పారాట్రూపర్‌లు పారాషూట్‌ను అనుసరిస్తూ పరీక్షను పర్యవేక్షించారు.

ఇదీ చూడండి:'అగ్ని-ప్రైమ్' క్షిపణి ప్రయోగం విజయవంతం

Last Updated : Dec 19, 2021, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details