సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్( ఎస్ఎఫ్డీఆర్) క్షిపణిని ఒడిశాలో చాందిపుర్ పరీక్షా కేంద్రం నుంచి శుక్రవారం విజయవంతంగా ప్రయోగించినట్లు డీఆర్డీఓ( డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) తెలిపింది.
ఎస్ఎఫ్డీఆర్ సాంకేతికతతో డీఆర్డీఓ క్షిపణి ప్రయోగం
ఎస్ఎఫ్డీఆర్ సాంకేతితతో అభివృద్ధి చేసిన క్షిపణిని ఒడిశాలోని చాందిపుర్ పరీక్షా కేంద్రం నుంచి డీఆర్డీఓ శుక్రవారం నాడు విజయవంతంగా ప్రయోగించింది. గగనతలంలో సుదూర లక్ష్యాల్ని ఛేదించే మిస్సైల్స్‌ను తయారు చేయడానికి ఎస్ఎఫ్డీఆర్ సాంకేతికత డీఆర్డీఓకు ఉపయోగపడుతుంది.
ఎస్ఎఫ్డీఆర్ క్షిపణి ప్రయోగం విజయవంతం
శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు ఈ ప్రయోగం జరిపినట్లు వెల్లడించింది. ప్రయోగ సమయంలో గ్రౌండ్ బూస్టర్స్‌తో సహా అన్ని ఉపభాగాలు అనుకున్నదానికంటే మెరుగ్గా పనిచేసినట్లు డీఆర్డీఓ తెలిపింది. గగనతలంలో సుదూర లక్ష్యాల్ని ఛేదించే మిస్సైల్స్‌ను తయారు చేయడానికి ఎస్ఎఫ్డీఆర్ సాంకేతికత ఉపయోగపడుతుంది.
ఇదీ చూడండి:అధునాతన ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం
Last Updated : Mar 5, 2021, 6:26 PM IST