తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏడు నెలల గర్భిణికి ఆపరేషన్​.. పిండం వృద్ధి చెందలేదని లోపల పెట్టి కుట్లు వేసిన డాక్టర్​ - కరీంగంజ్​ ప్రభుత్వాసుపత్రి న్యూస్​

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వెళ్లిన గర్భిణికి.. నెలలు నిండక ముందే ఆపరేషన్​ చేసి బిడ్డను బయటకు తీశారు ఓ ప్రభుత్వ వైద్యుడు. పిండం వృద్ధి చెందలేదని గ్రహించిన డాక్టర్​.. మళ్లీ లోపల పెట్టి కుట్లు వేశారు. ఈ దారుణ ఘటన అసోంలోని కరీంగంజ్​లో జరిగింది.

seven months pregnant
ఏడు నెలల గర్భిణి

By

Published : Aug 31, 2022, 9:36 PM IST

అసోంలో ఓ ప్రభుత్వ వైద్యుడి​ నిర్లక్ష్యం.. ఏడు నెలల గర్భిణి ప్రాణానికే ముప్పు తెచ్చింది. కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వెళ్లిన గర్భిణికి.. నెలలు నిండక ముందే ఆపరేషన్​ చేసి బిడ్డను బయటకు తీశారు. పిండం వృద్ధి చెందలేదని గ్రహించిన వైద్యుడు.. మళ్లీ లోపల పెట్టి కుట్లు వేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

అసలేం జరిగిందంటే.. అసోంలోని నవీ నమశూద్ర అనే ఓ ఏడు నెలల గర్భిణికి నొప్పులు వచ్చాయి. దీంతో కరీంగంజ్​లోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ కుమార్ బిస్వాస్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సరిగ్గా పరీక్షించకుండానే ఆమెకు ఆపరేషన్​ చేశారు. అనంతరం బిడ్డను బయటకు తీసి చూడగా.. పిండం సరిగ్గా వృద్ధి చెందలేదు. దీనిని గమనించిన వైద్యుడు.. పిండాన్ని తిరిగి లోపల పెట్టి కుట్లు వేసి పంపించేశారు. తాజాగా బాధితురాలి పరిస్థితి విషమించి ఆస్పత్రికి వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు.. డాక్టర్​ను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details