Schools Shut: కరోనా కేసులు పెరగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోని పాఠశాలల్లో ఏ ఒక్కరికి కరోనా సోకినా.. పాఠశాల ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసివేయాలని సూచించింది. విద్యార్థులు, సిబ్బంది మాస్కులు, భౌతిక దూరం పాటించాలని దిల్లీ విద్యాశాఖ కోరింది. కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగినా.. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు.
'ఒక్కరికి కరోనా సోకినా స్కూల్ మొత్తం మూసేయాల్సిందే!'
పాఠశాలలో ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినా.. ప్రాంగణమంతా తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించింది దిల్లీ ప్రభుత్వం. ఇటీవల నగరంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దిల్లీలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. గురువారం 325 మంది మహమ్మారి బారినపడ్డారు. సోమవారం నాటి కేసులతో పోలిస్తే 237% పెరుగుదల నమోదైంది. ఒక్క వారంలో పాజిటివిటీ రేటు 0.5% నుంచి 2.39%కి పెరిగింది. పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరిచిన నేపథ్యంలో జాతీయ రాజధాని ప్రాంత పరిధిలోని కొందరు పిల్లలు, సిబ్బంది కొవిడ్ బారిన పడినట్లు వార్తలొస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వసంత్‌కుంజ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8 మంది పిల్లలు, ఇద్దరు సిబ్బందికి పాజిటివ్‌గా తేలినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
ఇదీ చదవండి:'రబ్బర్ స్టాంప్' రాజకీయం! పంజాబ్ అధికారులకు కేజ్రీవాల్ ఆదేశాలా?