తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఐటీ నిబంధనలపై స్టే ఇవ్వలేం'

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఐటీ నిబంధనలపై స్టే ఇవ్వాలని పలు మీడియా సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యంపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనల అమలుపై స్టే ఇవ్వడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

delhi high court
దిల్లీ హైకోర్టు

By

Published : Jun 28, 2021, 2:25 PM IST

డిజిటల్ న్యూస్​ మీడియాను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలపై స్టే ఇవ్వడం కుదరదని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై పిటిషనర్ వాదనతో ఏకీభవించలేమని తేల్చి చెప్పింది.

ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ నిబంధనలను పాటించాలని.. ఫౌండేషన్ ఫర్​ ఇండిపెండెంట్​ జర్నలిజం, ది వైర్, క్వింట్​ డిజిటల్​ మీడియా లిమిటెట్​, ఆల్ట్​ న్యూస్​ మాతృసంస్థ ప్రవ్ధ మీడియా ఫౌండేషన్​లకు.. కేంద్రం ఇటీవల నోటీసులు జారీ చేసింది. లేకపోతే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో వార్తా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై వాదనలు విన్న జస్టిస్​ సీ. హరి శంకర్​, జస్టిస్​ సుబ్రహ్మణియం ప్రసాద్​లతో కూడిన ధర్మాసనం.. నిబంధనల అమలుపై స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.

"మీ వాదనతో మేము ఏకీభవించలేము. మీకు కావాలంటే సహేతుకమైన, వివరణాత్మకమైన ఉత్తర్వులు జారీ చేస్తాము. లేదంటే పిటిషన్​ను రోస్టర్ బెంచ్​కు నోటిఫై చేస్తాం. నోటీసుల్లో ఉన్న విషయాలను పూర్తిగా పరిశీలించి, తిరిగి మాకు తెలియజేయండి"

-దిల్లీ హైకోర్టు

అనంతరం.. పిటిషనర్ల అభ్యర్థన మేరకు విచారణను జులై 7కు వాయిదా వేసింది దిల్లీ హైకోర్టు.

ఇదీ చూడండి:ఫేస్​బుక్​, గూగుల్​కు కేంద్రం సమన్లు

ABOUT THE AUTHOR

...view details