పౌల్ట్రీ అమ్మకాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది దిల్లీ ప్రభుత్వం. దిల్లీలోని ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లులేవని స్పష్టమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, పశు సంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ నిషేధం ఎత్తివేతపై స్పష్టత ఇచ్చినట్లు తూర్పు దిల్లీ మేయర్ నిర్మల్ జైన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముగ్గురు మేయర్లు, ముగ్గురు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్లు పాల్గొన్నారని తెలిపారు. దిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మూడు నగరపాలికల్లోనూ పౌల్ట్రీ క్రయవిక్రయాలకు అనుమతి లభించిందని వివరించారు.