defeated sarpanch candidate digs road: పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకపోయాడు బారిక్ షాబర్ అనే వ్యక్తి. కోపంతో ఐదు గ్రామాలకు వెళ్లే రోడ్డును తవ్వి.. బండరాళ్లను అడ్డంగా పెట్టి రహదారిని నిర్బంధించాడు. వీధి దీపాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటన ఒడిశా గజపతి జిల్లాలోని గంగాబాడ పంచాయతీలో గురువారం జరిగింది.
రోడ్డుకు అడ్డుగా బండరాళ్లు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో గంగాబాడ పంచాయతీ ఉంది. ఇక్కడ మొత్తం 1500 మంది ఓటర్లు ఉన్నారు. గంగబాడ పంచాయతీలో గత 15 సంవత్సరాలుగా హరిబంధు కర్జీ లేదా అతని కుటుంబ సభ్యులే సర్పంచ్‌గా ఎన్నికవుతున్నారు.
రహదారిని తవ్విన నిందితుడు సర్పంచ్‌గా ఓడిపోవడం వల్లే...
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా బారిక్ షాబర్పై హరిబంధు కర్జీ ఘన విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ కోపంతోనే బారిక్ రహదారుల దిగ్బంధానికి పాల్పడ్డాడని కర్జీ ఆరోపించారు. ఈయన స్థానికులతో కలిసి గారబంధ పోలీస్ స్టేషన్‌లో బారిక్‌పై ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: మణిపుర్ రెండో విడత పోలింగ్ షురూ.. బరిలో 92 మంది అభ్యర్థులు