తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైలు పట్టాలకు పగుళ్లు.. ఎర్ర వస్త్రాన్ని చూపి వేల మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన రైతు

Rail Accident Missing : గోమతి ఎక్స్​ప్రెస్​కు భారీ ప్రమాదం తప్పింది. ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్ రాజ్- లఖ్​నవూ మార్గంలో పట్టాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. వాటిని గుర్తించిన స్థానిక రైతు.. పగుళ్ల వద్దకు రైలు చేరుకోక ముందే గోమతి ఎక్స్​ప్రెస్​ను ఆపాడు. ఎర్రని వస్త్రంతో లోకోపైలట్​కు సంకేతాలిచ్చాడు.

crack-on-railway-in-uttarpradesh-track-farmer-stopped-train-by-showing-red-garment-after-seeing-cracks-on-track
ఉత్తరప్రదేశ్‌లో రైల్వే ట్రాక్‌పై పగుళ్లు

By

Published : Aug 4, 2023, 5:15 PM IST

Crack On Railway Track : ఓ రైతు వేల మంది రైలు ప్రయాణికుల ప్రాణాలను రక్షించాడు. రైల్వే ట్రాక్​పై పగుళ్లను గుర్తించి.. రైలు ప్రమాదం జరగకుండా నిలువరించాడు. రైలును ఆపాలని ఎర్రని ​వస్త్రాన్ని​ లోకో పైలట్​కు చూపుతూ.. భారీ ప్రమాదం నుంచి గట్టెక్కించాడు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్ రాజ్​ నుంచి లఖ్​నవూకు బయలుదేరిన గోమతి ఎక్స్​ప్రెస్​కు ఈ ప్రమాదం తప్పింది.

ప్రయాగ్​ రాజ్​ జిల్లాలోని భోలా కా పూర్వ గ్రామానికి చెందిన భన్వర్ సింగ్ అనే రైతు తన పొలం వైపు వెళుతుండగా.. లాల్​గోపాల్‌గంజ్ సమీపంలో రైల్వే ట్రాక్​పై పగుళ్లను గుర్తించాడు. అప్పుడే అటుగా వస్తున్న రైలును సైతం గమనించాడు. వెంటనే అప్రమత్తమై ఎర్రని వస్త్రాన్ని చూపుతూ.. రైలును ఆపాలని లోకోపైలట్​కు సంకేతాలిచ్చాడు. రైతు ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న లోకోపైలట్​.. రైలు వేగానికి బ్రేకులు వేసి నిదానంగా దాన్ని ఆపాడు.

పట్టాలకు పగుళ్లు
రైతు భన్వర్​ సింగ్​

అనంతరం పట్టాలపై పగుళ్లను లోకోపైలట్​కు చూపించాడు భన్వర్ సింగ్. ఘటనపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన లోకోపైలట్​.. రైతు భన్వర్ సింగ్​ను అభినందించాడు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడేసినందుకు రైతుకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా పట్టాలపై పగుళ్ల కారణంగా ఆ మార్గంలో కాసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టాలకు మరమ్మతులు పూర్తయిన అనంతరం రైళ్ల రాకపోకలు సాఫీగా సాగాయి.

పట్టాలను పరిశీలిస్తున్న ప్రయాణికులు

తప్పిన భారీ ప్రమాదం.. రెండు భాగాలుగా విడిపోయిన ఎక్స్​ప్రెస్​ రైలు.. చివరకు..
నెల రోజుల క్రితం కూడా బిహార్​లోని కతిహార్ జిల్లాలో​ ఘోర రైలు ప్రమాదం తప్పింది. లోహిత్​ ఎక్స్​ప్రెస్ రైలు​ ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిన్ నుంచి సుమారు 10 బోగీలు విడిపోయి పట్టాల మీద నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. బంగాల్​లోని నార్త్​ దినాజ్​పుర్​ జిల్లాలోని ఉన్న దల్ఖోలా స్టేషన్​ సమీపంలో ఈ ఘటన జరిగింది. కోచ్​ నుంచి బోగీలు విడిపోయాక.. అనేక మంది ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. అనంతరం విడిపోయిన బోగీలను మళ్లీ ఇంజిన్​కు జతచేసి.. రైలు ప్రారంభించారు అధికారులు. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details