తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కథ ముగియలేదు.. సుదీర్ఘకాలంపాటు కరోనా వ్యాప్తి!' - భారత్​ బయోటెక్​ సంస్థ

సుదీర్ఘకాలంపాటు కరోనా(Coronavirus) వ్యాప్తి కొనసాగే అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్​ఓ(Who On Covid 19) తెలిపింది. భవిష్యత్తులో వైరస్​ వ్యాప్తి తగ్గడం అనేది ప్రజల్లో ఏర్పడే రోగ నిరోధక శక్తి స్థాయులపై ఆధారపడి ఉంటుందని చెప్పింది. 'కొవాగ్జిన్' టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చే(Covaxin Who Approval News) విషయంపై సమీక్షిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే అనుమతులు లభిస్తాయని స్పష్టం చేసింది.

who coronavirus
డబ్ల్యూహెచ్​ఓ కరోనా

By

Published : Sep 28, 2021, 4:32 PM IST

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి(Coronavirus) వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)(Who On Covid 19). ఇప్పుడిప్పుడే మహమ్మారి మనల్ని వీడే అవకాశం లేదని అభిప్రాయపడింది. సుదీర్ఘకాలం పాటు కరోనా(Coronavirus) వ్యాప్తి కొనసాగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్​ఓ(Who On Covid 19) అధికారి పూనమ్​ ఖేత్రపాల్ సింగ్​ పేర్కొన్నారు. భవిష్యత్తులో కరోనా ఎండెమిక్​(స్థానిక వ్యాధి)గా(Covid Endemic Phase) మారుతుందా? అనేది ప్రజల్లోని రోగ నిరోధక శక్తి స్థాయిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 'మనం వైరస్ నియంత్రణలో ఉన్నాం. వైరస్ మన​ నియంత్రణలో లేదు' అని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు.

"భవిష్యత్తులోనూ చాలాకాలంపాటు వైరస్​ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో వైరస్​ ఎండెమిక్ స్థాయికి చేరుతుందా? లేదా? అని విభిన్న అంశాలు నిర్ణయిస్తాయి. ఎక్కువ మందికి వైరస్​ సోకడం, ఎక్కువ మందికి టీకా పంపిణీ చేయడం ద్వారా వచ్చిన రోగ నిరోధక శక్తి వాటిలో ప్రధానమైంది. రోగనిరోధక శక్తి స్థాయులు ఎక్కవగా ఉంటే.. భవిష్యత్తులో వైరస్​ వ్యాప్తి చెందేందుకు తక్కువ అవకాశాలు ఉంటాయి. "

-పూనమ్​ ఖేత్రపాల్ సింగ్, డబ్ల్యూహెచ్​ఓ దక్షిణ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్​

దేశీయంగా భారత్ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్(Coronavirus) టీకా కొవాగ్జిన్​కు అత్యవసర వినియోగానికి అనుమతి(ఈయూఓ)(Covaxin Who Approval News) ఇచ్చే విషయంపై డబ్యూహెచ్​ఓ సమీక్ష జరపుతోందని పూనమ్​ చెప్పారు. ఆ ప్రక్రియ పూర్తవ్వగానే కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​ఓ ఈయూఓ గుర్తింపునిస్తుందని చెప్పారు.

బూస్టర్​ డోసు అవసరమేనా?

టీకా తీసుకోని వారిలో కరోనా వైరస్(Coronavirus)​ కారణంగా మరణాలు, కేసులు పెరుగుతున్నాయని పూనమ్​ తెలిపారు. పలు దేశాలు బూస్టర్​ డోసు పంపిణీ ప్రారంభిస్తున్న సమయంలో అనేక దేశాల్లో ఇంకా చాలా మంది.. తమ మొదటి డోసు టీకా కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అందుకే... బూస్టర్​ డోసు వినియోగంపై 2021 చివరి వరకు డబ్ల్యూహెచ్​ఓ ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు.

"టీకా తీసుకున్న వారిలో కొంతకాలం తర్వాత.. వైరస్​ను ఎదుర్కోవడంలో టీకా సమర్థత తగ్గిపోతుందనడానికి ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేవు. వ్యాధి బారిన పడి తీవ్రంగా ప్రభావితమైన వారిని రక్షించడంలో, మరణాలు ముప్పును తగ్గించడంలో టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. కొన్ని వర్గాల వారికి వ్యాక్సిన్​ బూస్టర్​ డోసు అవసరం లేదు అనే విషయాన్ని డబ్ల్యూహెచ్​ఓ ఇంకా తోసిపుచ్చలేదు. అయితే.. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా దీనిపై డబ్ల్యూహెచ్​ఓ సూచనలు చేస్తుంది."

-పూనమ్​ ఖేత్రపాల్ సింగ్, డబ్ల్యూహెచ్​ఓ దక్షిణ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్​

ఇదో అరుదైన అవకాశం..

కరోనా(Coronavirus) నిబంధనలను ప్రజలంతా పాటించడం ద్వారా, ఎక్కువ మంది టీకా తీసుకోవడం ద్వారా.. దేశంలో వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని, మరో దశ ఉద్ధృతి వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని పూనమ్​ అన్నారు. ఇదే విషయం వివిధ దేశాల్లో నిరూపితమైందని పేర్కొన్నారు. విదేశాలకు కొవిడ్ టీకాలను మళ్లీ ఎగుమతి చేయాలని కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఆమె​ ప్రశంసించారు. ఫ్రంట్​లైన్​ వర్కర్స్, వృద్ధులకు, కరోనా ముప్పు అధికంగా ఉన్నవారికి టీకా అందిస్తూనే ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ సమానంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా మహమ్మారి.. మన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి దొరికిన అరుదైన అవకాశం అని చెప్పారు.

ఇవీ చూడండి:

201రోజుల తర్వాత 20వేల దిగువకు కరోనా కేసులు

'కరోనాతో కలిసి జీవించే స్థితికి భారత్​'

Covid Endemic: భారత్‌లో కరోనా.. 6 నెలల్లో ఎండెమిక్‌ దశలోకి..?

ABOUT THE AUTHOR

...view details