Covid Cases in India: దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం 8 గంటల వరకు 15,754 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 47 మంది కరోనాతో మరణించగా.. 15,220 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.58 శాతం వద్ద స్థిరంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.23 శాతం, డైలీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉంది.
- మొత్తం కేసులు: 4,43,14,618
- క్రియాశీల కేసులు: 1,01,830
- మొత్తం మరణాలు: 5,27,253
- కోలుకున్నవారు: 4,36,85,535