Covid cases in India: దేశంలో కరోనా కేసులు పెరిగాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 10,725 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 36 మంది కరోనాతో మరణించారు. ఒక్కరోజులో 13,084 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.60 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.21 శాతంగా ఉన్నాయి.
- మొత్తం కేసులు: 4,43,78,920
- క్రియాశీల కేసులు: 94,047
- మొత్తం మరణాలు: 5,27,488
- కోలుకున్నవారు: 4,37,57,385
Vaccination India: భారత్‌లో బుధవారం 23,50,665 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,10,82,34,347కు చేరింది. మంగళవారం మరో 3,92,837 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 739,171 కేసులు వెలుగుచూశాయి. మరణాలు కూడా భారీగా పెరిగాయి. ఒక్కరోజులో 2 వేలమందికిపైగా మరణించారు. మొత్తం కేసులు 60,31,85,878 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 64,79,892 మంది మరణించారు. ఒక్కరోజే 9,38,644 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 57,79,06,497కు చేరింది.
- జపాన్‌లో కరోనా కేసులు రోజుకు 2 లక్షల చొప్పున నమోదవుతున్నాయి. బుధవారం మరో 1,94,223 మంది వైరస్ బారినపడ్డారు.
- దక్షిణ కొరియాలో కొత్తగా లక్షా 39 వేల కొవిడ్ కేసులు వెలుగుచూశాయి.
- అమెరికాలో మళ్లీ కొవిడ్ బాధితులు భారీగా పెరిగారు. ఒక్కరోజే 81 వేల కేసులు, 350కిపైగా మరణాలు నమోదయ్యాయి.
- జర్మనీ, జపాన్, తైవాన్లోనూ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి.