కరోనా వైరస్ను కట్టడి చేయడానికి మొదటి, రెండో దశల మధ్య చేపట్టాల్సిన తగు జాగ్రత్తలను కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలు తీసుకోలేదని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఈ కారణంగానే కొత్త కేసులు భారీగా వెలుగు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని ప్రజలందరకీ ఉచితంగా టీకా ఇస్తున్నట్లు తక్షమే ప్రకటించి, అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న సమాచారం దక్షిణాది ప్రజలను భయపెట్టిస్తోందన్న ఆయన.. ప్రజలను కాపాడేందుకు కేంద్రం తగు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఔషధాలు, ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరత ఎక్కువగా ఉందని వార్త పత్రికల నివేదికలు చెప్తున్నాయని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.