రెండో దశ కరోనా వ్యాప్తి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య రెండు లక్షలకు మించి నమోదవుతుండటం.. సామాన్యులతో పాటు ప్రభుత్వాలనూ కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ప్రతి 24 గంటలు గడిస్తే.. ఎన్ని కేసులు వస్తాయోనన్న ఆందోళనా సర్వత్రా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం ఒక్కరోజే 1,341 మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా 2,34,692 మంది కరోనా బారినపడ్డారు.
శ్మశానాల్లో ఖననానికీ స్థలం సరిపోనంతగా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇక్కడే.. అనుమానాలకు తావిచ్చేలా ఓ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వాలు వెల్లడిస్తున్న గణాంకాలు ఎంతవరకు వాస్తవమనే అంశం చర్చనీయాంశంగా మారుతోంది. దీనిపై వాస్తవాలు శోధించేందుకు 'ఈటీవీ భారత్' స్వయంగా రంగంలోకి దిగింది. అసలు మరణాలు, ప్రభుత్వ గణాంకాల మధ్య సారూప్యత లేకపోవడంపై పరిశీలన చేపట్టింది. ఈ రియాలిటీ చెక్‌లో కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
మధ్యప్రదేశ్‌లో..
గురువారం 10,166 కేసులు వెలుగులోకి వచ్చినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం తన బులెటిన్‌లో వెల్లడించింది. 53 మంది మరణించారని తెలిపింది. ఇదే విధంగా 47 మంది చనిపోయారని ఏప్రిల్ 12న తన ప్రకటనలో వివరించింది. కానీ ఆ రోజు.. రెండు జిల్లాల్లోనే 95 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. భోపాల్‌లో 58, ఛింద్వాడాలో 37 మందిని ఖననం చేశారు. ఈటీవీ భారత్ సందర్శించని మరో 50 జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే విషయంపై ఆందోళన నెలకొంది. రాష్ట్ర వైద్య శాఖ విడుదల చేస్తున్న గణాంకాలపై అనుమానాలు పెంచుతోంది.
దిల్లీ
కరోనా మహమ్మారి వ్యాప్తి రాజధాని నగరాన్నీ అస్తవ్యస్తం చేస్తోంది. శుక్రవారం 24 గంటల వ్యవధిలో 16,699 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. 112 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 54,309 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏప్రిల్ 12న 72 మంది చనిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 43 మృతదేహాలు, న్యూదిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 40 శవాలకు అంత్యక్రియలు జరిగాయి.
ఛత్తీస్‌గఢ్