తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Corona: మరో 54వేల కేసులు.. 1,321 మరణాలు

దేశంలో కరోనా కేసులు(Coronavirus Live Updates) స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 54,069 మందికి కొవిడ్​ సోకినట్లు తేలింది. మరో 1,321 మంది మరణించారు.

corona cases in India
భారత్​ లో కరోనా కేసులు

By

Published : Jun 24, 2021, 9:41 AM IST

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Corona virus) బుధవారంతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. కొత్తగా 54,069 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా, మహమ్మారి ధాటికి మరో 1,321 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 68,885 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు:3,00,82,778
  • మొత్తం మరణాలు:3,91,981
  • కోలుకున్నవారు:2,90,63,740
  • యాక్టివ్ కేసులు:6,27,057

బుధవారం ఒక్కరోజే 18,59,469 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 39,78,32,667కు చేరింది.

దేశవ్యాప్తంగా 30,16,26,028 వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రస్తుతం ఆందోళన..

డెల్టా ప్లస్‌ రకాన్ని.. 'ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 కన్ఫార్షియం ఆన్‌ జీనోమిక్స్‌ (ఇన్సాకాగ్‌)' ప్రస్తుతం ఆందోళనకర రకం (వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌)గా పేర్కొన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనిలో సంక్రమణశక్తి పెరగడం, ఊపిరితిత్తుల కణాల్లోని గ్రాహకాలతో గట్టిగా బంధాన్ని ఏర్పరచడం, మోనాక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సకు పెద్దగా లొంగకపోవడం వంటి లక్షణాలున్నట్లు ఇన్సాకాగ్‌ పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details