దేశంలో కరోనా కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 62,714 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 312 మంది మరణించారు. 28,739 మంది వైరస్ను జయించారు.
- మొత్తం కేసులు:1,19,71,624
- మొత్తం మరణాలు:1,61,552
- కోలుకున్నవారు:1,13,23762
- యాక్టివ్ కేసులు:4,86,310
మార్చి 27నాటికి దేశవ్యాప్తంగా 24,09,50,842 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.