తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. జపాన్​లో తగ్గని ఉద్ధృతి - దేశంలో కరోనా కేసుల వివరాలు

Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 243 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 185 మంది కోలుకున్నారు.

corona Cases in India
భారత్​లో కరోనా కేసులు

By

Published : Dec 30, 2022, 10:03 AM IST

Corona Cases in India : భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 243 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 185 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 44,679,266
  • మరణాలు: 5,30,699
  • యాక్టివ్ కేసులు: 3,609
  • రికవరీలు: 4,41,43,850

Vaccination In India: దేశంలో గురువారం 81,097 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,20,09,14,546కు చేరింది. ఒక్కరోజే 2,13,080 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,65,441 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,513 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 66,38,12,079 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 66,93,549 మంది మరణించారు. మరో 3,62,735 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 63,59,00,923కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 1,92,063 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 420 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియా 71,427 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 76 మంది మృతి చెందారు.
  • బ్రెజిల్​లో 27,269 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 130 మరణాలు నమోదయ్యాయి.
  • అమెరికాలో కొత్తగా 32,197 కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా 239 మంది ప్రాణాలు విడిచారు.
  • తైవాన్​లో 27,955 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 36 మంది మృతి చెందారు.

ఇవీ చదవండి:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి కన్నుమూత
పదో తరగతిలో ఫెయిల్.. వ్యర్థాలతో సొంతంగా బైక్ తయారీ.. ఖర్చు రూ.10వేలే!

ABOUT THE AUTHOR

...view details