తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ గెలిస్తే చొరబాటుదార్లకు గేట్లు తెరిచినట్లే'

కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్​ చేతుల్లో అసోం సురక్షితంగా ఉండదని అన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వస్తే అసోంలో చొరబాటుదార్లకు అన్ని మార్గాలు తెరుస్తాయని విమర్శించారు.

Cong-AIUDF will open all gates to welcome infiltrators: Amit Shah
'కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే.. వారికి గేట్లు తెరిచినట్లే'

By

Published : Jan 24, 2021, 5:42 PM IST

Updated : Jan 24, 2021, 5:52 PM IST

కాంగ్రెస్​-ఏఐయూడీఎఫ్​ అసోంలో అధికారంలోకి వస్తే జరిగేది చొరబాటుదార్ల రంగప్రవేశమేనని విమర్శించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరగనున్న వేళ ఆదివారం నల్బరిలో ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు షా. ఈ క్రమంలో కాంగ్రెస్​ హయాంలో దక్కింది రక్తసిక్త పాలన, యువత ప్రాణనష్టమేనని దుయ్యబట్టారు.

"కాంగ్రెస్​, బద్రుద్దీన్​ అజ్మల్​కు చొరబాటుదార్ల నుంచి అసోంను విముక్తి చేసే శక్తి ఉందా? ఆ పార్టీలు అధికారంలోకి వస్తే గేట్లు బార్లా తెరిచి మరీ వారిని స్వాగతిస్తాయి. ఎందుకంటే అది వారి ఓటు బ్యాంకు. బ్రిటీషర్ల విభజించు-పాలించు విధానాన్నే కాంగ్రెస్ కొనసాగించింది. ఆదివాసీలు, ఆదివాసీయేతరలు, అసోమీలు, కొండ ప్రాంతీయులు, బోడోలు, బోడోయేతరుల మధ్య చీలిక తీసుకొచ్చింది. కాంగ్రెస్​ 20 ఏళ్ల పాలనలో రక్తపాతం మినహా ఇంకేం జరగలేదు. ఆ పార్టీ హయాంలో జరిగిన కాల్పుల్లో 10వేల మంది అసోం యువత ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్లు, నిరసనలు, వరదలు లేని రాష్ట్రం కోసం భాజపాకు ఓటేయండి."

-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వమే అక్రమ చొరబాటుదారుల నుంచి అసోంను రక్షించగలదని వ్యాఖ్యానించారు షా. భాజపా మతతత్వ పార్టీ అనే కాంగ్రెస్​ విమర్శలను తిప్పికొట్టారు. "మాది మతతత్వ పార్టీ అని కాంగ్రెస్​ ఆరోపిస్తుంది. కానీ కేరళలో ముస్లిం లీగ్, అసోంలో ఏఐయూడీఎఫ్​తో పొత్తు పెట్టుకుంది ఎవరు?" అని నిలదీశారు.

ఏప్రిల్​ లేదా మేలో అసోంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏఐయూడీఎఫ్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్​), ఏజీఎంతో కలిసి మహాకూటమిగా బరిలోకి దిగనుంది కాంగ్రెస్.

ఇదీ చూడండి:'కాంగ్రెస్​లా కాదు.. బోడో ఒప్పందం అమలు చేస్తాం'

Last Updated : Jan 24, 2021, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details