తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2021, 7:22 AM IST

ETV Bharat / bharat

400 ఏళ్లనాటి వినాయక విగ్రహం స్వాధీనం

విదేశాల్లో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న 400 ఏళ్ల నాటి వినాయక విగ్రహాన్ని(ganesha idol) స్వాధీనం చేసుకున్నారు చెన్నై కస్టమ్స్​ అధికారులు. ఇత్తడితో చేసిన 130 కిలోల బరువున్న ఈ విగ్రహం(antique ganesha idol) ఇప్పటి వరకు పట్టుబడిన వాటిల్లో అతిపెద్దదిగా చెప్పారు.

400 year old Ganesha statue
400 ఏళ్లనాటి వినాయక విగ్రహం పట్టివేత

400 ఏళ్లనాటి పురాతన వినాయక విగ్రహాన్ని(ganesha idol) కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో పట్టుకున్నట్లు చెన్నై విమానాశ్రయం అధికారులు తెలిపారు.

400 ఏళ్లనాటి వినాయక విగ్రహం పట్టివేత

విదేశాల్లో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న 'నృత్య గణపతి' విగ్రహం(antique ganesha idol) కాంచీపురంలోని ఓ ఇంటిలో ఉన్నట్లు వచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తనిఖీలు చేసినట్లు కస్టమ్స్​ అధికారులు తెలిపారు. ఈ వినాయక విగ్రహం(antique ganesha statue) 130 కిలోల బరువు, 5.25 అడుగుల ఎత్తు ఉన్నట్లు చెప్పారు. ఇత్తడితో చేసినట్లు తెలిపారు.

400 ఏళ్లనాటి వినాయక విగ్రహం పట్టివేత

విగ్రహాల స్మగ్లింగ్​కు సంబంధం ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. చెన్నై కస్టమ్స్​ విభాగం సీజ్​ చేసిన విగ్రహాల్లో ఇదే అతిపెద్దదని చెప్పారు.

ఇదీ చూడండి:రూ.35కోట్ల విలువైన పురాతన విగ్రహాల పట్టివేత

ABOUT THE AUTHOR

...view details