దేశంలో రోజువారీ కరోనా కేసుల పెరుగుదలతో కేంద్రం అప్రమత్తమైంది. కఠినమైన నియంత్రణా చర్యలతో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచుతూ వైరస్‌లో జన్యుమార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్రాలను కోరింది. యాంటీజెన్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన కేసులను మళ్లీ ఆర్టీపీసీఆర్ ద్వారా పరీక్షించాలని స్పష్టం చేసింది. కేసుల పెరుగుదలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పేర్కొంటూ ఈ మేరకు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు పంపింది.
ప్రస్తుతం దేశంలో 1,45,634 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 74 శాతం కంటే ఎక్కువ కేసులు కేవలం కేరళ, మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, జమ్ముకశ్మీర్లలోనూ వైరస్ కేసులు బారీగా నమోదవుతున్నాయని కేంద్రం పేర్కొంది. కేరళలో గత నాలుగు వారాల్లో సరాసరిగా 34,800 నుంచి 42000 మధ్య వైరస్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో గత నాలుగు వారాల్లో సరాసరిగా 18000 నుంచి 21000 వేల మద్య కేసులు వెలుగుచూశాయి. పంజాబ్‌లో పాజిటివ్ కేసులరేటు గత నాలుగు వారాల్లో 1.4 నుంచి 1.6 శాతం పెరిగిందని కేంద్రం పేర్కొంది.