తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంగరంగ వైభవంగా లేగదూడ నామకరణ వేడుక - మధ్యప్రదేశ్​ వార్తలు

Calf Naming ceremony: సొంత కూతురిలా చూసుకుంటున్న ఆవుకు జన్మించిన లేగదూడకు ఘనంగా నామకరణ వేడుక నిర్వహించింది ఓ కుటుంబం. బంధుమిత్రులు, పండితులను పిలిపించి పేరు పెట్టింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్​లోని ఖండవాలో జరిగింది.

naming ceremony of a calf
లేగదూడకు ఘనంగా నామకరణ వేడుక

By

Published : Dec 18, 2021, 12:53 PM IST

Updated : Dec 18, 2021, 1:27 PM IST

అంగరంగ వైభవంగా లేగదూడ నామకరణ వేడుక

Calf Naming ceremony: సాధారణంగా పిల్లలకు 21వ రోజున నామకరణ వేడుక చేసి పేరు పెట్టడం చూశాం. కానీ, మధ్యప్రదేశ్​లోని ఖండవాకు చెందిన ఓ కుటుంబం లేగదూడకు అంగరంగ వైభవంగా నామకరణ వేడుక నిర్వహించి పేరు పెట్టింది. ఆవు దూడ పుట్టిన ఆరో రోజున ఈ వేడుక చేసింది.

బంధుమిత్రులు, గ్రామస్థుల సమక్షంలో.. సంప్రదాయ పద్ధతిలో వేడుక నిర్వహించి లేగదూడకు పేరు పెట్టారు. పుట్టిన సమయాన్ని బట్టి దూడకు 'జమున'గా పేరు నిర్ణయించారు పండితుడు. వేడుకకు హాజరైన బంధువులు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు.

లేగదూడకు నామకరణ చేస్తున్న దంపతులు

ఖండవాలోని కిన్నర్​ సమాజానికి చెందిన సితారాజాన్​ అనే మహిళ.. ట్రాన్స్​వుమెన్​​. కైలాశ్​ అనే వ్యక్తిని 16 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. తాను పిల్లలను కనలేనని, తన ఇంట్లోని ఆవునే సొంత కూతురిలా చూసుకుంటున్నట్లు చెప్పారు సితారాజన్​. అందుకే.. లేగదూడకు నామకరణ వేడుక ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. ఇందుకు తన భర్త కైలాశ్​ సైతం సహకరించారని తెలిపారు.

లేగదూడకు ఘనంగా నామకరణ వేడుక

ఎమ్మెల్యే హాజరు..

ఈ కార్యక్రమంలో ఖండవా ఎమ్మెల్యే దేవేంద్ర వర్మ సైతం పాల్గొనటం గమనార్హం. ఈ వేడుక నిర్వహించిన కుటుంబాన్ని ప్రశంసించారు.

ఇదీ చూడండి:

ఆరడుగుల 'బుల్‌'లెట్టు.. ఏటా రూ.25 లక్షల సంపాదన

200 కిలోల రైస్​- చికెన్​తో శునకాల ఆకలి తీర్చుతున్న జంతుప్రేమికురాలు

Last Updated : Dec 18, 2021, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details