తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సొంత బావపై హత్యాయత్నం- మతాంతర వివాహమే కారణం - దిల్లీ వార్తలు

వేరే మతానికి చెందిన వ్యక్తిని తన సోదరి పెళ్లి చేసుకుందని ఓ వ్యక్తి కోపం పెంచుకున్నాడు. సొంత బావను హత్య (Crime news Telugu) చేసేందుకు ప్రయత్నించాడు. ఇంటికి పిలిచి మరీ కాల్పులు జరిపాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.

man shot brother in law
man shot brother in law

By

Published : Oct 31, 2021, 1:14 PM IST

Updated : Oct 31, 2021, 2:31 PM IST

మతాంతర వివాహం కారణంగా సొంత బావపై హత్యాయత్నం (Crime news Telugu) చేశాడు ఓ వ్యక్తి. దిల్లీలోని మోడల్ టౌన్​లో ఈ ఘటన జరిగింది. బాధితుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

ఇదీ జరిగింది...

పోలీసుల కథనం ప్రకారం.. దేవా అనే వ్యక్తి ఆదర్శ్ నగర్​లో జిమ్​ను నిర్వహిస్తున్నాడు. ఇతర మతానికి చెందిన ఓ యువతిని ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేదు. ఈ విషయంపై యువతి సోదరుడు షానవాజ్ అలియాస్ షాబాజ్(21).. దేవాపై కక్ష పెంచుకున్నాడు. దీంతో హత్య చేసేందుకు ప్రయత్నించాడు.

తన స్నేహితుడు హర్షిత్ అలియాస్ హృతిక్(20)తో కలిసి దేవా హత్యకు ప్రణాళిక రచించాడు షాబాజ్. మోడల్ టౌన్​కు రావాలని దేవాకు ముందుగా ఫోన్ చేశాడు. బుల్లెట్ బండిపై వచ్చిన దేవాను నిందితులు కలిశారు. షాబాజ్, హృతిక్.. దేవా బైక్​పై ఎక్కి షాలిమార్ పార్క్ వద్దకు వెళ్లారు.

అనంతరం పథకం ప్రకారం నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. అర్ధరాత్రి సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. పార్క్ సమీపంలోని రోడ్​పై పడి ఉన్న దేవాను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఆరు గంటల్లో అరెస్ట్

ఘటన జరిగిన ఆరు గంటల్లోగా నిందితులను పట్టుకున్నట్లు వాయవ్య దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఉషా రంగ్నాని తెలిపారు. నిందితులు ఉపయోగించిన పిస్తోళ్లు, లైవ్ కాట్రిడ్జ్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బాధితుడి ద్విచక్రవాహనాన్నీ సైతం సీజ్ చేసినట్లు చెప్పారు. నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారని వివరించారు.

ఇదీ చదవండి:

Last Updated : Oct 31, 2021, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details