భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ)ల మధ్య చర్చలు శనివారం జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ.. పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టాతో మాట్లాడారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య చర్చలు పరస్పర సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్యం, పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. భారత్-ఈయూ మధ్య చర్చలకు భౌగోళిక రాజకీయ ప్రముఖ్యత ఏర్పడుతుందని ఇరు దేశాధినేతలు ప్రకటించారు.
'భారత్-ఈయూ చర్చలతో వాణిజ్యం బలోపేతం'
సమగ్ర స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్-యూరోపియన్ల మధ్య శనివారం చర్చలు జరపనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టాతో సంభాషించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య జరుగుతున్న ఈ సదస్సు పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇరుదేశాలు తెలిపాయి.
భారత్-ఈయూ చర్చలు ప్రపంచ వాణిజ్యానికే తలమానికం
రాబోయే రోజుల్లో ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగానూ భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఇరువురు నాయకులు అన్నారు. ఈ భేటీ విలువైన భాగస్వామ్యంతో పాటు ఐరోపాకు వ్యూహాత్మక సంబంధాలను విస్తృతం చేసే దిశగా అవకాశాలను కల్పిస్తుందని వెల్లడించారు. భారత్-ఐరోపా దేశాలు తమ సంబంధాలను మరింత విస్తరించుకునేందుకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు.
ఇదీ చూడండి:భారత్-ఈయూ చర్చలు.. పాల్గొననున్న మోదీ