తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంగానది తీరంలో సమాధుల కలకలం

గంగానది తీరంలో మృతదేహాలను పాతిపెట్టిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో మరొకటి వెలుగు చూసింది. ప్రయాగ్​రాజ్​లోని దేవరఖ్​ ఘాట్​ వద్ద భారీ సంఖ్యలో సమాధులు కనిపించాయి. కన్నౌజ్​ జిల్లాలో మహాదేవి ఘాట్​ వద్ద మృతదేహాలు నీటిలో కొట్టుకురావడం కనపించింది.

Bodies in ganga
గంగానదిలో మృతదేహాలు

By

Published : May 16, 2021, 1:55 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో గంగానది తీరాన దేవరఖ్​ ఘాట్​ వద్ద భారీ సంఖ్యలో మృతదేహాలను పాతిపెట్టిన ఘటన వెలుగుచూసింది. అయితే.. ఇవి కొవిడ్​తో మృతి చెందినవారివా? కాదా? అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ సమాధులపై కాషాయ వస్త్రం కప్పి ఉండటం గమనార్హం.

ప్రయాగ్​రాజ్​లో సమాధులు
ప్రయాగ్​రాజ్​లో దేవరఖ్​ ఘాట్​ వద్ద సమాధులు

కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుండగా.. మృతదేహాల అంత్యక్రియల నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా పెరిగింది. దీంతో ఆర్థిక స్తోమతలేని వారు.. తమ బంధువుల మృతదేహాలను ఇలా గంగానది ఒడ్డున ఖననం చేసి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

కొట్టుకొస్తూనే ఉన్న మృతదేహాలు..

మరోవైపు.. ఉత్తర్​ప్రదేశ్​లోని గంగానదిలో మృతదేహాలు కొట్టుకువస్తున్న ఘటనలు కొనసాగతూనే ఉన్నాయి. తాజాగా.. కన్నౌజ్​ జిల్లాలోని మహాదేవి ఘాట్​ వద్ద 50 మృతదేహాలు తేలియాడుతూ కనిపించటం కలకలం రేపింది. భారీ వర్షాల కారణంగా మృతదేహాలు నది ఒడ్డుకు వచ్చి చేరాయి.

మహాదేవి ఘాట్​ వద్ద గంగానదిలో తేలియాడుతున్న మృతదేహాలు

మహాదేవి​ ఘాట్​ వద్ద 'ఈటీవీ భారత్'​ తీసిన ఓ ఎక్స్​క్లూజివ్​ వీడియోలో.. నది ఒడ్డులో మృతదేహాన్ని పూడ్చే ప్రదేశం పక్కన పీపీఈ కిట్​ ధరించిన ఓ వ్యక్తి నిల్చోవటం కనిపించింది. దీన్ని బట్టి కొవిడ్​ మృతదేహాలనే వారు ఇలా ఖననం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతదేహాన్ని ఖననం చేసే వద్ద పీపీఈ కిట్​ ధరించి నిల్చున్న వ్యక్తి

అధికారుల చర్యలు..

నెలరోజుల వ్యవధిలోనే మహాదేవి గంగా ఘాట్​ వద్ద దాదాపు 2,000 మంది అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. ఈ మృతదేహాల విషయం వార్తల్లోకి రావడం వల్ల అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు కన్నౌజ్​ జిల్లా అదనపు మేజిస్ట్రేట్​ గజేంద్ర సింగ్​.. ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

మహాదేవి గంగా ఘాట్​ వద్ద మృతదేహాల దహనం

కన్నౌజ్​ జిల్లా కంటే ముందు.. ఉత్తర్​ప్రదేశ్​లోని గాజీపుర్​, ఉన్నావ్​, చందౌలీ, కాన్పుర్​, వారణాసి సహా ఇతర జిల్లాల్లో గంగానదిలో మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఇదీ చూడండి:గంగానదిలో మృతదేహాల కట్టడికి పోలీసుల పహారా

ఇదీ చూడండి:గంగానది ఒడ్డున ఇసుకలో మృతదేహాల కలకలం

ABOUT THE AUTHOR

...view details