తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ అన్నాడీఎంకేపై ఆ రాష్ట్ర భాజపా ఇంఛార్జ్ సీటీ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో అన్నాడీఎంకే నిర్ణయిస్తుందన్నారు. పొత్తులో అతిపెద్ద పార్టీ అన్నాడీఎంకే అని తెలిపారు.
సీఎం అభ్యర్థిని ఎన్డీఏ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తమిళనాడు భాజపా నేతలు అనుకున్నారు. కానీ కమలం పార్టీ వెనక్కి తగ్గింది.
కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే నుంచే సీఎం అభ్యర్థి ఉంటారని భాజపా చెప్పుకుంటూ వచ్చింది. "కానీ అభ్యర్థి ఎవరు?.. అనేది ఎన్డీఏ అధిష్ఠానం నిర్ణయిస్తుందని.. ముందే పళనిస్వామిని అనుకోవద్దు" అని తమిళనాడు భాజపా అధ్యక్షుడు ఎల్. మురుగన్ ఇటీవల అన్నారు.