తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాటన్​తో శానిటరీ ప్యాడ్​లు- ఏడాదికి ఆరు చాలు!

తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ఇషానా అనే యువతికి వచ్చిన ఓ ఆలోచన యావత్​ మహిళల సమస్యకు ఓ పరిష్కారం చూపింది. పర్యావరణహితమైన, పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లను అందుబాటులోకి తెచ్చింది.

By

Published : Oct 18, 2019, 8:02 AM IST

కాటన్​తో శానిటరీ ప్యాడ్​లు- ఏడాదికి ఆరు చాలు!

కాటన్​తో శానిటరీ ప్యాడ్​లు- ఏడాదికి ఆరు చాలు!

ఇషానా... తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన 18 ఏళ్ల యువతి. యువ పారిశ్రామికవేత్తగా ఎదిగి.. తనతో పాటు 15 మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి చేరింది.

పాఠశాలకు వెళ్లే రోజుల్లోనే 6 నెలలపాటు ఫ్యాషన్​ డిజైనింగ్​ కోర్సు అభ్యసించింది ఇషానా. మహిళలకు ఉపయోగపడేలా, పర్యావరణహితమైన పునర్వినియోగ కాటన్​ శానిటరీ ప్యాడ్లను తయారు చేయాలని ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. చుట్టుపక్కల మహిళలు ఆమె ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ఇషానాతో కలిసి ఈ నాప్కిన్​లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమె వద్ద 15 మంది మహిళలు పని చేస్తున్నారు.

"ఈ క్లాత్​ ప్యాడ్​ను ముందు నేను వినియోగించాను. మిగిలినవారి కోసమూ తయారు చేస్తే వారికి ఇది ఉపయోగపడుతుంది అనిపించింది. మిషన్​పై కుట్టడం మొదలుపెట్టాను. ఈ పని చేయడం సంతృప్తినిచ్చింది. ఒక అమ్మాయి ఓ సంవత్సరానికి 60-70 సాధారణ ప్యాడ్లను వినియోగిస్తుంది. ఈ పునర్వినియోగ ప్యాడ్లు అయితే ఏడాదికి 6 సరిపోతాయి."
-ఇషానా, కాటన్​ ప్యాడ్​ సృష్టికర్త

కాటన్​ ప్యాడ్​ల పరిశ్రమను మరింత విస్తరించాలని భావిస్తోంది ఇషానా. ఇందుకోసం కార్పొరేట్ సంస్థలను కలిసేందుకు ప్రయత్నిస్తోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్​ఆర్​) కింద వారి నుంచి ఆర్థిక సాయం పొందాలన్నది ఇషానా ఆలోచన.

ప్లాస్టిక్​ భూతాన్ని తరిమికొట్టాలని ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు... ప్లాస్టిక్​తో తయారు చేసిన శానిటరీ నాప్కిన్లను విడనాడాలని ఇషానా కోరుతోంది.

ABOUT THE AUTHOR

...view details