మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి శుక్రవారం తానే స్వయంగా వెళ్తానని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ వెల్లడించారు. ఈ కేసులో పవార్‌తో పాటు ఆయన మేనల్లుడు అజిత్ పవార్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ముంబయిలో ఉండకపోవచ్చని.. అంతమాత్రాన అందుబాటులో లేనట్లు అధికారులు చిత్రీకరించరాదని సూచించారు పవార్. తానే వెళ్లి బ్యాంకు కుంభకోణానికి సంబంధించి వారికి కావల్సిన సమాచారమంతా ఇస్తానని చెప్పారు. ఎన్నికలకు ముందు ఈడీ ఇలాంటి చర్యలు చేపట్టడమేంటని ప్రశ్నించారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ సిద్ధాంతాలను పాటించే తాము.. దిల్లీ సింహాసనం ముందు మోకరిల్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.