తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ పొడిగింపుపై డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసలు - WHO updates on India

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను ఎదుర్కొనేందుకు భారత్‌ ఎంచుకున్న లాక్‌డౌన్‌ అస్త్రానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు పలికింది. మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన భారత ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించింది డబ్ల్యూహెచ్​ఓ.

WHO lauds India's "tough and timely" anti-corona actions
భారత్‌ లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని స్వాగతించిన డబ్ల్యూహెచ్‌ఓ

By

Published : Apr 14, 2020, 5:08 PM IST

భారత్‌లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్వాగతించింది. కొవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ తీసుకుంటున్న చర్యల్ని డబ్ల్యూహెచ్‌ఓ ప్రాంతీయ డైరెక్టర్‌ పూనం ఖేత్రపాల్‌ ప్రశంసించారు. దీనిని క్లిష్ట పరిస్థితుల్లో సమయానుకూల నిర్ణయంగా అభిప్రాయపడ్డారు.

అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ.. కరోనాపై పోరులో భారత్‌ దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతుందని కొనియాడారు ఖేత్రపాల్‌. అయితే వైరస్‌ వ్యాప్తి విషయంలో ఇది ఎంతవరకు సత్ఫలితాన్నిస్తుందో చెప్పడం తొందరపాటు అవుతుందని ఆమె తెలిపింది.

ప్రజల అనుసరణపైనే లాక్‌డౌన్‌ ఎత్తివేత

వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కీలకమైన 'భౌతిక దూరం' నిబంధన పటిష్ట అమలుకు లాక్‌డౌన్‌ ఎంతో దోహదం చేస్తుందన్నారు. వీటితో పాటు.. కరోనా అనుమానితుల్ని గుర్తించడం, వేరు చేయడం, పరీక్షలు నిర్వహించడం, వైరస్‌ సోకినట్లు తేలితే చికిత్స అందజేయడం వంటి చర్యల్ని కూడా ముమ్మరం చేయాలని.. అలా చేస్తేనే ఫలితముంటుందని ఖేత్రపాల్‌ అభిప్రాయపడ్డారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాల్ని ప్రజలు ఎలా అనుసరిస్తారన్న దానిపైనే లాక్‌డౌన్‌ ఎత్తివేత ఆధారపడి ఉంటుందని గుర్తుచేశారు.

కరోనా కారణంగా భారత్‌లో ఇప్పటివరకు 339 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 10,363కు చేరింది.

ఇదీ చదవండి:'న్యూజిలాండ్‌ ఊపిరి పీల్చుకో.. నేనున్నాను'

ABOUT THE AUTHOR

...view details