ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ సూచనలపై నిర్భయతల్లి ఆశా దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హత్యచేసిన వారిని సోనియాగాంధీ క్షమించినట్లు.. నిర్భయ దోషులను నేను క్షమించాలని చెప్పడానికి ఈమె ఎవరు? అని ప్రశ్నించారు. నేరస్థులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలాంటి వారివల్లే అత్యాచార కేసుల్లో నిందితులకు సరైన శిక్షలు పడటం లేదని ఆశాదేవి ఆరోపించారు.
'క్షమించవచ్చుగా...'
2012లో దిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం వల్ల నిర్భయ మరణించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత దోషులకు ఉరిశిక్ష పడింది. ఫిబ్రవరి 1న వారికి ఉరితీయాలని దిల్లీ కోర్టు ఆదేశించింది.