ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సునిశిత వ్యాఖ్యలు చేశారు. ఐదో తరం రాజకీయ వారసుడిని భారత యువత కోరుకోవడం లేదన్నారు. కేరళ కోజికోడ్‌లో నిర్వహించిన సాహితీ ఉత్సవంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు గుహ.
"మలయాళీలు రాహుల్‌ను ఎంపీగా ఎందుకు ఎన్నుకున్నారు? రాహుల్‌పై వ్యక్తిగతంగా నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. రాహుల్ చాలా మంచి, మర్యాదగల వ్యక్తి. అయిదో తరం రాజకీయ వారసుడు యువ భారత్‌కు అక్కరలేదు."
-రామచంద్రగుహ, చరిత్రకారుడు
మలయాళీలు 2024లోనూ రాహుల్‌నే తిరిగి ఎన్నుకొని తప్పు చేస్తే అది ప్రధాని మోదీకే ప్రయోజనం కలిగిస్తుందన్నాకు గుహ. రాహుల్ కాకపోవడమే మోదీకి గొప్ప ప్రయోజనమన్నారు.
మోదీ స్వయంకృషీవలుడు
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంకృషితో ఎదిగారని రామచంద్రగుహ ప్రశంసించారు. ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పాలించిన అనుభవం ఉందన్నారు. మోదీ నిత్య కృషీవలుడిగా ఉంటారని.. విహార యాత్రలకు యూరప్ వెళ్లరని అన్నారు. ఇదంతా మనఃస్ఫూర్తిగా చెబుతున్నట్లు రామచంద్రగుహ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్... భారత్ అప్రమత్తం