తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు దేశవ్యాప్తంగా వైద్యుల కొవ్వత్తుల ర్యాలీ! - doctors protest

కరోనాపై పోరులో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోగులకు చికిత్స అందిస్తున్న తమపై దాడులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు కేంద్రం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసింది ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు బుధవారం కొవ్వత్తుల ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.

IMA demands ordinance from govt
ప్రాణాలను పణంగా పెడుతున్నాం..మాకు రక్షణగా చట్టం తేవాలి

By

Published : Apr 22, 2020, 4:43 AM IST

కరోనా మహమ్మారి కట్టడిలో వైద్య సిబ్బంది పాత్ర వెలకట్టలేనిది. ప్రాణాలను లెక్క చేయకుడా విధులు నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్నారు. అయితే.. పలు చోట్ల తమమై దాడులు జరుగుతున్నాయని, రోగులు దురుసుగా ప్రవరిస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. తమకు రక్షణగా తక్షణమే ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. సత్వరమే చర్యలు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.

వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా వైద్యసిబ్బంది తెల్లకోటు ధరించి కొవ్వత్తుల ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్​.

గుజరాత్​లో 28,000 డాక్టర్ల మద్దుతు..

ఇండియన్​ మెడికల్ అసోసియేషన్​ పిలుపుకు గుజరాత్ డాక్టర్ల సమాఖ్య మద్దతు తెలిపింది. బుధవారం రాత్రి 9గంటలకు రాష్ట్రంలోని 28,000 మంది వైద్య సిబ్బంది తెల్ల కోటు ధరించి వారి వారి ప్రాంతాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపింది.

" కొందరు రోగులు మాపై దాడులకు తెగబడుతున్నారు. మమ్మల్ని సామాజికంగా వెలివేస్తున్నారు. అధికారుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇంటి యజమానులు ఇళ్లలోకి రానివ్వడం లేదు. మాకు రక్షణగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టం చేయాలి. "

-ఇండియన్ మెడికల్ అసోసియేషన్

చెన్నైలో దారుణం

కరోనా రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఔ వైద్యుడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించిన ఘటన ఇటీవలే చెన్నైలో జరిగింది. మృతదేహం వల్ల వైరస్ తమ ప్రాంతంలో వ్యాపిస్తుందనే అపోహలతో వారు ఖననాన్ని అడ్డుకున్నారు.

మరణించిన తర్వాత కూడా వైద్యుడికి గౌరవం లభించకపోతే తమకు విలువేముందని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన మరునాడు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తామని తెలిపారు. అప్పటీకీ కేంద్రం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కరోనాపై పోరులో సామాన్యులే సైంటిస్టులు

ABOUT THE AUTHOR

...view details