తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో జనాభా పెరుగుదలపై వెంకయ్య ఆందోళన

దేశంలో పెరుగుతున్న జనాభాపై ఆందోళన వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జనాభా పెరుగుదలపై రాజకీయ నాయకులు చర్చించేందుకు ముందుకు రాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ సమస్యపై పోరాడేందుకు కృషి చేయాలని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్​ 58వ స్నాతకోత్సవంలో వెంకయ్య పిలుపునిచ్చారు.

By

Published : Feb 14, 2020, 7:12 PM IST

Updated : Mar 1, 2020, 8:43 AM IST

Vice Prez flags concern over galloping population, its widespread ramifications
దేశంలో జనాభా పెరుగుదలపై 'వెంకయ్య ఆందోళన'

దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుండటంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ఈ అంశంపై మాట్లాడేందుకు ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు.

దిల్లీలో ఇండియన్​ ఆగ్రికల్చరల్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ (ఐఏఆర్​ఐ) 58వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హజరైన ఆయన.. 'ప్రపంచ ఆహార సూచీ(జీహెచ్​ఐ)'లో భారత్​ ర్యాంక్​ 102కు పడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

1950-51లో దేశంలో ఆహార ఉత్పత్తులు దాదాపు 51 మిలియన్​ టన్నులు కాగా, ప్రస్తుతం 283.37 టన్నులకు పెరిగినప్పటికీ.. జీహెచ్​ఐ ర్యాకింగ్స్​లో భారత్ స్థానం మరింత దిగజారిందని వెల్లడించారు వెంకయ్య. వియత్నాం.. భారత్​ కంటే 10 రెట్లు ఎక్కువ వరిని పండిస్తోందని, ఆ దిశగా మన శాస్త్రవేత్తలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.

" దేశంలో ప్రస్తుతం 283.37 మిలియన్​ టన్నుల ఆహార ఉత్పత్తులు వస్తున్నప్పటికీ ప్రపంచ ఆహార సూచిలో భారత్​కు 102వ ర్యాంక్​ రావటం ఆందోళన కలిగించే విషయం. ఈ అంశంపై విధాన రూపకర్తలు, రాజకీయ నాయకులు, పార్లమెంట్ ​సభ్యులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది."

- వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి.

ఇదీ చూడండి:మేకలు కాస్తూ కలిశారు.. పోరాడి ప్రేమను గెలిపించుకున్నారు

Last Updated : Mar 1, 2020, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details