తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'2024 నాటికి 5 బిలియన్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతే లక్ష్యం'

భారత్​ను ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన కీలకంగా వ్యవహరిస్తుందన్నారు రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్. 2024 నాటికి భారత్​ ఐదు బిలియన్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుందని ఉత్తర్​ప్రదేశ్​లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్​పో వేదికగా విశ్వాసం వ్యక్తం చేశారు.

defence expo
డిఫెన్స్ ఎక్స్​పో 2020

By

Published : Feb 8, 2020, 5:44 AM IST

Updated : Feb 29, 2020, 2:34 PM IST

'2024 నాటికి 5 బిలియన్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతే లక్ష్యం'

2024 నాటికి ఐదు బిలియన్ల రక్షణ ఉత్పత్తులను భారత్​ ఎగుమతి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో జరుగుతున్న డిఫెన్స్​ ఎక్స్​పో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

"2024 నాటికి ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించడంలో.. డిఫెన్స్​ ఎక్స్​పో అనంతర పరిణామాలు కీలకంగా పనిచేస్తాయి. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో ఈ డిఫెన్స్​ ఎక్స్​పో భారీ సహకారం అందిస్తుంది."-రాజ్​నాథ్​సింగ్, రక్షణమంత్రి

డిఫెన్స్​ ఎక్స్​పోలో భాగంగా ఆయా సంస్థలతో ఇప్పటివరకు 200కు పైగా ఒప్పందాలు చేసుకోవడం చారిత్రకమని అభివర్ణించారు రాజ్​నాథ్​. ఈ ఒప్పందాలతో రక్షణ రంగ సామర్థ్యం బలపడి.. దేశానికి లాభిస్తుందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 10, 745 కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసినట్లు వెల్లడించారు రాజ్​నాథ్. 2016-17 ఏడాదితో పోలిస్తే ఇది ఏడు రెట్లు అధికమన్నారు.

లక్ష్యానికి మించి ఫలితాలు..

డిఫెన్స్ ఎక్స్​పోలో భాగంగా 100 అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు 200కు పైగా ఒప్పందాలు జరిగినట్లు వెల్లడించారు. భారత రక్షణ ఉత్పత్తుల్లో ఇది ఓ నూతన అధ్యాయమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కరోనాను గుర్తించిన చైనా డాక్టర్​ మృతి

Last Updated : Feb 29, 2020, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details