తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇరాన్​ పరిస్థితులపై జయ్​శంకర్ ఆరా.. పాంపియోకు ఫోన్​

ఇరాన్​లో నెలకొన్న పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి... అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియోతో టెలిఫోన్​ సంభాషణలు జరిపారు. ఈ విషయంలో భారత్​ ఆందోళన చెందుతున్నట్లు ఆయన తెలిపారు.

US-Iran tension: Jaishankar holds conversation with Pompeo, highlights India's stakes, concerns
ఇరాన్​ పరిస్థితులపై మైక్ పాంపియోతో జైశంకర్​ చర్చలు

By

Published : Jan 5, 2020, 11:45 PM IST

గల్ఫ్​ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి ఎస్​ జయ్​ శంకర్...​ అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్​ పాంపియోతో టెలిఫోన్​లో సంభాషించారు. ఇరాన్ మిలటరీ కమాండర్​ ఖాసిం సులేమానీ హత్యపై అమెరికా- ఇరాన్​ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. భారత్​ ఈ విషయంలో ఆందోళన చెందుతున్నట్లు ఆయన తెలిపారు.

గల్ఫ్​ ప్రాంతంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియోతో సాయంత్రం టెలిఫోన్​ సంభాషణలు జరిపాను. భారత్​ ఈ విషయంపై ఆందోళన చెందుతోందని తెలియజేశాను.

జయ్​శంకర్​, భారత విదేశాంగ మంత్రి

ఇరాన్​ విదేశాంగ మంత్రి జావాద్​ జరీఫ్​తో కూడా జయ్​శంకర్​ సంభాషించారు. వారి దేశంలో ఉద్రిక్తతల గురించి భారత్​ తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. భారత్​ ఎల్లప్పుడూ శాంతినే సమర్థిస్తుందని జయ్​శంకర్​ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:శిశు మరణాలు: రాజ్​కోట్​లో 111.. జోధ్​పుర్​లో 100

ABOUT THE AUTHOR

...view details