తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో 39 మందిపై అత్యాచార కేసు పెట్టిన మహిళ! - up rape case

ఉత్తర్​ప్రదేశ్​ బరేలీ జిల్లాలో 32 ఏళ్ల మహిళ తనపై 39 మంది అత్యాచారం చేశారంటూ స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదును తీవ్రంగా ఖండిస్తున్నారు ఆ గ్రామవాసులు. తీసుకున్న అప్పు కట్టలేక సదరు మహిళ తప్పుడు కేసు పెట్టినట్లు ఆరోపిస్తున్నారు.

UP woman claims rape by 39 men, villagers up in arms
యూపీలో 39 మందిపై అత్యాచార కేసు పెట్టిన మహిళ!

By

Published : Jan 5, 2020, 7:12 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మహిళ పెట్టిన అత్యాచార కేసు సంచలనం సృష్టిస్తోంది. తనను గ్రామంలోని 39 మంది అత్యాచారం చేశారని ఆరోపిస్తూ బరేలీ జిల్లాలోని 32 ఏళ్ల మహిళ.. స్థానిక కంటోన్మెంట్​ పోలీసు స్టేషన్​లో కేసు పెట్టారు. ఆమె వివరాలు చెప్పిన నలుగురు సహా మరో 35 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆమె తన ఫిర్యాదులో అత్యాచార సమయంలో నిందితులు వీడియోను చిత్రీకరించినట్లు తెలిపారు. అంతేకాకుండా సదరు వీడియోను అడ్డం పెట్టుకుని ఏడాది నుంచి గ్రామంలోని 35 మంది తనను బలవంతం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరైన అమిత్​ తన ఇంటికి వచ్చి రూ.50 వేల నగదు దొంగలించారన్నారు.

అయితే ఈ కేసు దర్యాప్తు కోసం గ్రామానికి వెళ్లిన పోలీసులు.. స్థానికులు చెప్పిన సమాధానానికి నివ్వెరపోయారు.

అసలు ఏం జరిగింది?

బరేలీ జిల్లాలోని బరేలి గ్రామంలో 32 ఏళ్ల మహిళ, ఆమె భర్త నివసిస్తున్నారు. ఆమె భర్త మద్యానికి బానిస అయి... గ్రామంలో తెలిసిన 39 మంది దగ్గర మొత్తం 2.50 లక్షల రూపాయలను అప్పు చేశాడట. మొత్తం అప్పును తిరిగి చెల్లించవలసిందిగా ఆమె భర్తను అడగగా ఉన్న ఆస్తులను అమ్మి డబ్బులను చెల్లిస్తానని నమ్మబలికాడట. ఆ తర్వాత ఆస్తిని అమ్మి అప్పు చెల్లించకుండా భార్యాభర్తలు కలిసి అప్పు ఇచ్చిన 39 మందిపై తప్పుడు కేసులు పెట్టినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో గ్రామ ప్రజలంతా వాంగ్మూలం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ గ్రామ సర్పంచ్ అజయ్​ కుమార్​ చెప్పారు.

ఈ కేసులో నిజానిజాలపై దర్యాప్తు జరుగుతోందని, అమాయకులకు శిక్ష పడకుండా చూస్తామని గ్రామస్థులకు హామి ఇచ్చినట్లు ఎస్పీ షాలినీ పాండే తెలిపారు. అయితే బాధిత మహిళ పెట్టిన కేసు ప్రకారం నిందితులపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్​ 376-డీ, 392, 323, 506, 66 కింద కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

వారిపై కేసులు పెట్టినందున తనని గ్రామం నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నట్లు ఎస్పీకి మరో ఫిర్యాదు చేశారు బాధిత మహిళ.

ఇదీ చూడండి:అలర్ట్​: యూపీలో చొరబడిన ఇద్దరు ఐసిస్​ ఉగ్రవాదులు!

ABOUT THE AUTHOR

...view details