తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన దుండగులు - ఉత్తరప్రదేశ్ లిఖింపూర్​లో ఓ భూవివాదం ఘటన

ఓ భూవివాదంలో మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్​ లఖీంపుర్​ ఖేరీలో జరిగింది. తన స్థలాన్ని ఆక్రమించేందుకు వచ్చిన వారిని అడ్డగించారు మాజీ ఎమ్మెల్యే నిర్వేంద్ర. ఈ క్రమంలో వారు కర్రలతో కొట్టి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మాజీ శాసనసభ్యుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.

UP: Ex-MLA beaten to death, son injured
భూవివాదంలో మాజీ ఎమ్మెల్యను కొట్టి చంపిన దుండగులు

By

Published : Sep 6, 2020, 8:35 PM IST

ఉత్తర్​ప్రదేశ్ లఖీంపుర్​ ఖేరీలో భూవివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే నిర్వేంద్ర కుమార్ మున్న మృతి చెందారు. ఈ ఘటనలో అయన కుమారుడు కూడా గాయపడ్డారు.

ఇదీ జరిగింది..

నిర్వేంద్రకు చెందిన భూమిని కిషన్​ కుమార్ గుప్తా అనే వ్యక్తి కబ్జా చేశాడు. దీనిపై కేసు నమోదు చేయగా ఆ వివాదం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. అయితే.. గుప్తా తన అనుచరులతో కలిసి ఆదివారం ఆ భూమి వద్దకు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న నిర్వేంద్ర.. భూమి వద్దకు వచ్చి వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కిషన్ కుమారు.. సదరు ఎమ్మెల్యేను తీవ్రంగా గాయపరిచాడు. నిర్వేంద్రను ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన కుమారుడిపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు కిషన్​ కుమార్​ అనుచరులు. నిర్వేంద్ర ఆసుపత్రిలో చిక్సిత్స పొందుతూ మరణించారు.

అన్యాయంగా తమ స్థలాన్ని ఆక్రమించుకున్నారని.. అడ్డుకున్న తండ్రి, కొడుకులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబసభ్యులు.

ఖండించిన అఖిలేశ్​..

మాజీ ఎమ్మెల్యే నిర్వేంద్ర మున్న హత్య, ఆయన కుమారుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఈ ఘటనపై రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా షాక్‌కు గురైందన్నారు.

"ఈ రోజు పోలీసుల సమక్షంలో.. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నిర్వేంద్ర మున్నాని దారుణంగా కొట్టారు. భాజపా పాలనలో రాష్ట్ర ప్రజలు.. శాంతి భద్రతల విషయంలో ఆందోళన చెందటమే కాకుండా భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నా," అని అఖిలేష్​ ట్వీట్​ చేశారు. ఈ ఘటనపై వెంటనే ప్రభుత్వం వివరణనివ్వాలని డిమాండ్​ చేశారు.

మాజీ ఎమ్మెల్యే మృతిని నిరసిస్తూ స్థానిక​ ప్రజలు ఆందోళనకు దిగారు.

నిర్వేంద్ర కుమార్ మున్న 1989,1991లో స్వతంత్ర్య అభ్యర్ధిగా.. 1993లో సమాజ్ వాదీ పార్టీ టికెట్‌పై గెలిచారు.

ABOUT THE AUTHOR

...view details