తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర ప్రభుత్వం ఇకనైనా నిద్ర మేల్కొనాలి : కాంగ్రెస్

ఉన్నావ్ అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉత్తర్​ప్రదేశ్​ దేశ అత్యాచారాల రాజధానిగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కళ్లు తెరవాల్సి ఉందని పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీమతే డిమాండ్ చేశారు.

congress
అత్యాచారాల రాజధానిగా ఉత్తర్​ప్రదేశ్: కాంగ్రెస్

By

Published : Dec 7, 2019, 5:05 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​లో అత్యాచార బాధితురాలి మృతిపై విరుచుకుపడింది కాంగ్రెస్. రాష్ట్రం అత్యాచారాల రాజధానిగా మారుతున్న నేపథ్యంలో సర్కారు నిద్ర మేల్కొనాల్సిన అవసరం ఉందని హస్తం పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీమతే ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో శాంతి, భద్రతలు కుప్పకూలిన నేపథ్యంలో తాజా ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

"మేం ఈ ఘటనపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నాం. ఉత్తర్​ప్రదేశ్ దేశ అత్యాచారాల రాజధానిగా మారడాన్ని ప్రభుత్వం గుర్తించాలి."

-సుప్రియా శ్రీమతే, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

ఇదీ చూడండి: అత్యాచార నిందితుడిపై న్యాయవాదుల దాడి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details