బంగాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లకపోతే అసలైన మంచి రాజకీయ నేతలు కాలేరని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని (టీఎంసీ) చురుకుగా ఎదిరించాలని తెలిపారు. ఇంట్లో కూర్చోవడం సరైన నాయకుడి లక్షణం కాదంటూ సరికొత్త నిర్వచనం చెప్పారు.
'కేవలం ఇంట్లో కూర్చుంటే మంచి రాజకీయ నాయకులైపోతామని అనుకోకండి.. మీరందరూ పని చేయాలి. చురుగ్గా ఉండాలి. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలి. అప్పుడే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు మిమ్మల్ని బెదిరిస్తే భయపడకండి. మీరు జైలుకు వెళ్లనంత వరకు మీరు మంచి నాయకుడు అనిపించుకోరు.'
-దిలీప్ ఘోష్, బంగాల్ భాజపా అధ్యక్షుడు
మాటలు జాగ్రత్త..
బంగాల్ మంత్రి సోవందేవ్ ఛటోపాధ్యాయ్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.