తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో భవనం కూలి ఇద్దరు మృతి - సహాయక చర్యలు

బెంగళూరు యశ్వంత్​పురలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చని అనుమానం.

కర్ణాటకలో భవనం కూలి ఇద్దరు మృతి

By

Published : Apr 5, 2019, 11:31 AM IST

Updated : Apr 5, 2019, 12:43 PM IST

కర్ణాటకలో భవనం కూలి ఇద్దరు మృతి

కర్ణాటక బెంగళూరు సమీపంలోని యశ్వంత్​పుర​లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణదశలో ఉన్న ఓ భవనం కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు.

ఉదయం 4.40 గంటలకు ప్రమాదం జరిగింది. శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వీరిని రక్షించడానికి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

మృతుల్ని బంగాల్​కు చెందిన రాహుల్​, బిహార్​కు చెందిన రాకేశ్​గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఛత్తీస్​గఢ్​లో భారీ సంఖ్యలో నక్సల్స్ హతం!

Last Updated : Apr 5, 2019, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details