తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​ ఐటీ దాడుల్లో రూ.281 కోట్లు స్వాధీనం - Kamalnath

మధ్యప్రదేశ్​లో ఐటీశాఖ దాడుల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్​నాథ్​ అనుచరులకు చెందిన రూ.14.6 కోట్ల అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో మొత్తం రూ. 281 కోట్లను జప్తు చేసినట్లు పేర్కొన్నారు.

కమల్​నాథ్​ అనుచరులపై ఐటీశాఖ దాడులు

By

Published : Apr 9, 2019, 6:16 AM IST

మధ్యప్రదేశ్​ ఐటీ దాడుల్లో రూ.281 కోట్లు స్వాధీనం

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ అనుచరులకు చెందిన రూ. 14.6 కోట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడుల్లో 252 విదేశీ మద్యం సీసాలు, నగదు లావాదేవీల సమాచారమున్న కొంత మంది డైరీలు, హార్డ్​డిస్క్​లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో మొత్తం రూ. 281 కోట్లను జప్తు చేసినట్లు పేర్కొన్నారు.

దిల్లీలోనూ తనిఖీలు

దిల్లీలో అక్రమంగా తరలిస్తున్న రూ.20 కోట్ల నగదునూ జప్తు చేశారు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) అధికారులు. ఓ ప్రముఖ పార్టీ కార్యాలయానికి కార్యకర్త నగదు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కార్యకర్త బంధువుల ఇళ్లలో జరిపిన తనిఖీలతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశముందన్నారు.

రూ.230 కోట్ల అక్రమ లావాదేవీల సమాచారమున్న పుస్తకాన్ని, మరో రూ.242 కోట్ల బిల్లింగ్స్​ను, పన్ను ఎగవేతకు పాల్పడిన 80 కంపెనీల ఆధారాల గుర్తించారు ఐటీ అధికారులు.
ఎన్నికల నియమావళికి విరుద్ధమైన ఇలాంటి చర్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని ఐటీశాఖ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details