తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుల్వామా ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతం - పుల్వామా ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​లో ముష్కరుల్ని ఏరిపారేస్తోంది భారత సైన్యం. పుల్వామాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. వీరు ఏ ఉగ్రసంస్థకు చెందినవారో తెలియాల్సిఉంది.

Two militants killed in encounter with security forces in JK Pulwama
పుల్వామా ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతం

By

Published : May 2, 2020, 5:01 PM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో ఉదయం నుంచి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు దంగెర్​పొరా ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టిన భారత సైన్యంపై.. ముష్కరులు కాల్పులకు దిగారు. ఉదయం నుంచి ఇరువర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. దీటుగా బదులిచ్చిన భారత బలగాలు ఇద్దరిని మట్టుబెట్టాయి.

వీరు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారో తెలియాల్సి ఉంది. మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

శుక్రవారం పాక్​ సైన్యం జరిపిన కాల్పుల్లో గాయపడిన ఇద్దరు జవాన్లు ఇవాళ ఉదయం మరణించారు. మరో జవాను, ముగ్గురు పౌరులు గాయపడ్డారు.

ఇదీ చదవండి:పాక్​ కవ్వింపు చర్యలు.. ఇద్దరు భారత జవాన్లు మృతి

ABOUT THE AUTHOR

...view details