పొరుగు దేశం పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ చేసిన ట్వీట్‌పై దీటుగా స్పందించింది భారత్. ట్విట్టర్లో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులను ఉటంకిస్తూ ఇమ్రాన్... ఓ వీడియో పోస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ ప్రధాని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లింలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలుగా పేర్కొంటూ.. ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఇమ్రాన్. అయితే అది బంగ్లాదేశ్‌కు సంబంధించిన వీడియోగా తేలింది. ఈ నేపథ్యంలో భారత్‌కు వ్యతిరేక పోస్టుపై ట్విట్టర్ అధికారులు ఇమ్రాన్‌ను వారించారు. అనంతరం ఆయన ఖాతా నుంచి ఆ సందేశాన్ని తొలగించారు.
"ఇమ్రాన్ ట్విట్టర్ పోస్ట్ తప్పుడు వార్త అని గుర్తించాం. ట్విట్టర్‌కు నివేదించాం. ఇమ్రాన్ తన ఖాతా నుంచి ఆ సందేశాన్ని తర్వాత తొలగించారు."
- రవీశ్‌కుమార్, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి