తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహిళా ఆర్మీ పోలీసుల శిక్షణ 6న ప్రారంభం' - మహిళా ఆర్మీ పోలీసులు

దేశంలో తొలి మహిళా ఆర్మీ పోలీసుల శిక్షణ జనవరి 6న ప్రారంభమైనట్లు ఆర్మీ చీఫ్ జనరల్​ నరవాణే తెలిపారు. తొలి బ్యాచ్​లో మొత్తం 100 మంది మహిళలు ఉన్నారు.

Naravane
నరవాణే

By

Published : Jan 12, 2020, 6:02 AM IST

Updated : Jan 12, 2020, 8:03 AM IST

100 మందితో కూడిన తొలి మహిళా ఆర్మీ పోలీసులకు జనవరి 6 నుంచి శిక్షణ ప్రారంభమైనట్లు సైన్యాధిపతి ముకుంద్​ నరవాణే తెలిపారు.
దేశ చరిత్రలో తొలిసారి గత ఏడాది నుంచి మహిళలను మిలిటరీ పోలీసు విభాగంలోకి తీసుకోవడం ప్రారంభించారు. అప్పటి సైన్యాధిపతి, ప్రస్తుత సీడీఎస్​​ బిపిన్ రావత్​ మహిళలను సైన్యంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రెండేళ్ల తర్వాత ఇది అమల్లోకి వచ్చింది.

మహిళలకు పోరాట బాధ్యతలు ఎప్పుడు ఇవ్వనున్నారు అన్న ప్రశ్నకు.. పరోక్షంగా సమాధానమిస్తూ జనవరి 6 నుంచి తొలి బ్యాచ్​ మహిళా ఆర్మీ జవాన్​లకు శిక్షణ ప్రారంభమైనట్లు వెల్లడించారు నరవణే.

మహిళలను సైన్యంలోకి తీసుకునే విషయంపై 2017లోనే ఆర్మీ చీఫ్​ బిపిన్​ రావత్​ ప్రకటన చేశారు. అందులో భాగంగా తొలిసారిగా మిలిటరీ పోలీసు విభాగంలోకి మహిళలను తీసుకున్నారు.

ప్రస్తుతం మహిళలు సైన్యంలో ఉన్న వైద్యం, చట్టాలు, విద్య, సిగ్నల్స్​, ఇంజనీరింగ్​లో వారికి నచ్చిన విభాగాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:స్వతంత్ర అనంతరం చరిత్ర విస్మరణ: మోదీ

Last Updated : Jan 12, 2020, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details