ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొవిడ్-19(కరోనా వైరస్)ను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచిస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. ప్రస్తుతం భారత్.. ప్రపంచ ఆరోగ్య అత్యయిక పరిస్థితికి మధ్యలో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సర్వత్రా భయాలు వ్యక్తమవుతున్నందున... ఈ మేరకు సోనియా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
'కరోనాపై ముఖ్యమంత్రులకు సోనియా లేఖ'
చైనా నుంచి ప్రపంచదేశాలకు శరవేగంగా వ్యాపిస్తోంది కరోనా వైరస్. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు సోనియా.
కరోనాను నియంత్రించాలని సూచిస్తూ కాంగ్రెస్ సీఎంలకు లేఖ
దిల్లీలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ అయిన తరవాత.. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 31కి చేరుకున్నాయి.
ఇదీ చదవండి:'ఈనాడు'కు మరో గౌరవం- ఉత్తమ వార్తా పత్రికగా చాణక్య పురస్కారం
Last Updated : Mar 7, 2020, 4:14 PM IST