తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తిహార్​ కారాగారంలో బ్యూటీపార్లర్​ - beauty

ఆసియాలోనే అత్యంత సురక్షిత జైలుగా పేరుగాంచింది తిహార్ కారాగారం. అక్కడి మహిళా ఖైదీల కోసం ఓ ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. శిక్షించేందుకు కాదండోయ్... అందంగా తయారయ్యేందుకు.

తిహార్​ కారాగారంలో బ్యూటీపార్లర్​

By

Published : Mar 28, 2019, 5:00 AM IST

కరడుగట్టిన నేరస్థులు సైతం తిహార్​ జైలంటే భయపడతారు. తప్పించుకునేందుకు వీలులేని ఆసియాలోనే సురక్షిత కారాగారంగా పేరుగాంచింది ఆ జైలు. అక్కడి మహిళా కారాగారంలోని ఆరో నెంబర్​ గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ మహిళా ఖైదీల కోసం బ్యూటీపార్లర్​ ఏర్పాటు చేస్తున్నారు. దిల్లీలోని సౌందర్యశాలల్లో ఉండే సౌకర్యాలన్నీ తిహార్ బ్యూటీపార్లర్​లో ఉంటాయి.

బ్యూటీపార్లర్ కోసం వేర్వేరు డిజైన్లను పరిశీలించారు. చివరకు ఒకదాన్ని​ ఎంపిక చేశారు. ఎంతో ఆకర్షణీయంగా బ్యూటీ పార్లర్​ను తీర్చిదిద్దుతున్నారు.

ఖరీదూ తక్కువే...

బయట మార్కెట్లోని ధరలతో పోల్చితే అతితక్కువ ధరలకే ఖైదీలకు సౌందర్య సేవల్ని అందజేస్తామని చెబుతున్నారు జైలు అధికారులు. ఇప్పటివరకు తిహార్​ జైలులో కేవలం హెయిర్ కటింగ్ సెలూన్​ ఉండేది. అలంకరణకు సంబంధించిన సౌకర్యాలు లేవు. ఈ ఏర్పాటుతో తిహార్ జైల్లోని మహిళా ఖైదీలు తోటివారికి హెయిర్​ కటింగ్ చేయడమే కాదు అందంగా ముస్తాబూ చేస్తారన్నమాట.

విన్నపాలు తీర్చేందుకే

ఈ నూతన పార్లర్​లో ఒకేసారి ముగ్గురు నుంచి నలుగురు మహిళలకు సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హత్య, దారి దోపిడీ, దొంగతనం, మాదకద్రవ్యాల రవాణా వంటి తీవ్ర నేరాలే కాక ఇతర నేరాలు చేసిన వారు ఈ పార్లర్​ కోసం అధికారులకు విజ్ఞప్తి చేశారట.

ABOUT THE AUTHOR

...view details