తెలంగాణ

telangana

By

Published : Feb 19, 2020, 8:03 AM IST

Updated : Mar 1, 2020, 7:26 PM IST

ETV Bharat / bharat

పక్షులకు పొంచి ఉన్న ముప్పు... నెమళ్లు సేఫ్​

భారతీయ పక్షులలో దాదాపు 50 శాతం జాతులకు ముప్పు పొంచి ఉందని స్టేట్​ ఆఫ్ ఇండియ్​ బర్డ్స్​-2020 నివేదిక హెచ్చరించింది. జాతీయ పక్షి నెమళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశం. పక్షులపై మరిన్ని అంశాలు మీకోసం...

Birds are a threat
పక్షులకు ముప్పు పొంచే ఉంది

భారతీయ పక్షి జాతులనేకం ప్రమాదపుటంచున ఉన్నాయి. దాదాపు 50 శాతం పక్షి జాతులకు ముప్పు పొంచి ఉంది. అయితే జాతీయ పక్షిగా గుర్తించిన నెమళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా.. పిచ్చుకల సంఖ్య మెట్రో నగరాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో స్థిరంగానే ఉండటం ఆశాజనక పరిణామం. పక్షి ప్రేమికులు ఆన్‌లైన్‌లో అందించిన సమాచారం ఆధారంగా రూపొందించిన స్టేట్‌ ఆఫ్‌ ఇండియన్‌ బర్డ్స్‌- 2020 నివేదిక వివరాలివి..

పక్షులపై అధ్యయనాంశాలు

నివేదికలో మరికొన్ని అంశాలు

  • రాబందుల సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది.
  • తెల్ల మచ్చల రాబందులు భారీగా తగ్గుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో భారతీయ, ఈజిప్టియన్‌ రాబందులున్నాయి.
  • పశు, పక్షుల ఆరోగ్యం కోసం వాడే డైక్లోఫెనాక్‌ వీటికి శాపమైంది. (ప్రస్తుతం దీనిని నిషేధించారు)
  • గద్దల సంఖ్య క్షీణిస్తోంది.
    ముప్పులేని పక్షులు

ఇదీ చదవండి:డ్రైవర్​కు కారు గిఫ్ట్​గా ఇచ్చిన యజమాని

Last Updated : Mar 1, 2020, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details